ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి

సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్‌ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

Updated : 18 May 2024 05:06 IST

రాష్ట్ర సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ వినతి 

ఈనాడు, హైదరాబాద్‌: సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్‌ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు సురేష్‌కుమార్, ఇతర నేతలు పీఆర్సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను శుక్రవారమిక్కడ కలిశారు. ఉద్యోగులకు 42% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని.. సచివాలయ ఉద్యోగులకు పేస్కేలు పెంచాలని కోరారు. ఉచిత లేదా రాయితీతో మెట్రో రైలు ప్రయాణాన్ని కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు