పార్వతి బ్యారేజీ ఖాళీ

కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.

Published : 19 May 2024 03:11 IST

కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. ప్రస్తుతం ఇసుక, మట్టిదిబ్బలతో దర్శనమిస్తోంది. బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా.. ఏప్రిల్‌ 4న 1.021 టీఎంసీల నీరుంది. మరమ్మతు కోసం నీటిని దిగువకు వదలడంతో 0.131 టీఎంసీల డెడ్‌ స్టోరేజీకి నీటి మట్టం చేరింది. చాలా రోజుల తర్వాత బ్యారేజీ ఖాళీగా కనిపిస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలు చూడటానికి వస్తున్నారు.

న్యూస్‌టుడే, మంథని గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు