జూన్‌ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు

యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్‌ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్‌రావు వెల్లడించారు.

Published : 19 May 2024 03:38 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్‌ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్‌రావు వెల్లడించారు. ఆర్జిత పూజలతో పాటు బ్రేక్‌ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా సంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన కోరారు. సీనియర్‌ సిటిజన్లకు ప్రతి మంగళవారం ఉచితంగా దైవదర్శనం చేసుకునే అవకాశాన్ని జూన్‌ నుంచి అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు గంటపాటు ఈ దర్శనాలు ఉంటాయని చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు