ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు

ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి.

Published : 20 May 2024 02:58 IST

ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మొదట్లో రెండు రోజులకోసారి కురవగా, నాలుగు రోజుల నుంచి రోజూ కురుస్తున్నాయి. ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పినా అడుగు భాగంలో నీరు చేరి మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లులు కొనుగోలు చేస్తాయని ప్రభుత్వం చెప్పినా మిల్లర్లు తేమ నిర్ధారణ అయితేనే కొనుగోలు చేస్తామంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టపోతామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

 న్యూస్‌టుడే, వెంకటాపూర్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని