థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం

భూటాన్‌ రాజధాని థింపూలో అసోసియేషన్‌ ఆఫ్‌ బుద్ధిస్ట్‌ టూర్‌ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది.

Published : 20 May 2024 04:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: భూటాన్‌ రాజధాని థింపూలో అసోసియేషన్‌ ఆఫ్‌ బుద్ధిస్ట్‌ టూర్‌ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏబీటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ..ఆసియా హైవే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో భారత్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌ దేశాల్లో బౌద్ధ పర్యాటక కేంద్రాలను అధిక సంఖ్యలో సందర్శించేలా ఆయా దేశాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, బుద్ధవనం కన్సల్టెంట్‌ ఈమని శివనాగిరెడ్డి, భూటాన్‌ పర్యాటక సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని