జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల

బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం విడుదల చేసింది.

Published : 20 May 2024 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌  ౖ’’్ఝ్చi-.-్మ్చ.్చ‘.i-  లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. బీఆర్క్‌ పరీక్ష ఫలితాల్లో ఝార్ఖండ్‌కు చెందిన బసాక్, తమిళనాడు విద్యార్థి ముత్తు 100 పర్సంటైల్‌ సాధించారు. ఏపీకి చెందిన యాయవరం శ్రవణ్‌ రామ్, తెలంగాణ విద్యార్థులు వివేక్‌జిత్‌ దాస్, బోడ ప్రభంజన్‌ జాదవ్, బానోత్‌ రిత్వక్‌ 99 పర్సంటైల్‌ స్కోర్‌ చేశారు. బీప్లానింగ్‌లో అరుణ్‌ రాధాకృష్ణ (కర్ణాటక), కలసాని సాకేత్‌ ప్రణవ్‌ (ఏపీ) 100 పర్సంటైల్‌ సాధించారు. ఏపీ విద్యార్థి కాలిగాట్ల దేవీప్రసాద్‌ 99.99 పర్సంటైల్‌ సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని