టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు

రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు.

Published : 21 May 2024 06:14 IST

రాష్ట్రంలోనే తొలిసారి ఒకే నంబరుకు అత్యధిక రాబడి

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం రూ.25,50,002 చెల్లించినట్లు హైదరాబాద్‌ జేడీసీ సి.రమేశ్‌ తెలిపారు. దీంతోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని