మళ్లీ ఊపందుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు

ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.

Published : 21 May 2024 05:47 IST

ఈనాడు, హైదరాబాద్‌- జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు పూర్తికావాలంటే వీరిని విచారించడం తప్పనిసరి. అందుకే వీరిపై ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి కోర్టు అనుమతులూ తీసుకున్నారు. తాను జూన్‌ నెలాఖరులో హైదరాబాద్‌కు తిరిగి వస్తానని ప్రభాకర్‌రావు పేర్కొన్నప్పటికీ అధికారులు మాత్రం దర్యాప్తు ప్రక్రియను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఒకవేళ వీరిద్దరూ మరో దేశానికి తరలిపోతే ఆచూకీ తెలుసుకోవడం కష్టమవుతుంది. అందుకే ఏ దేశంలో ఉన్నా తిరిగి రప్పించేందుకు.. వచ్చే నెలలోపు వారిద్దరిపై రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించాలని పోలీసులు భావిస్తున్నారు. 

విచారణ కార్యాలయం మార్పు

ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ కార్యాలయాన్ని జూబ్లీహిల్స్‌ ఠాణాకు మార్చారు. ఈ కేసు మొదలైనప్పటి నుంచి పశ్చిమ మండల డీసీపీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ ఠాణాలో విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి ఉండటంతో కార్యాలయాన్ని రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని