ఆలోచన అదిరింది... బండి కదిలింది

తక్కువ ఖర్చుతో సోలార్‌ పవర్‌తో నడిచే బైక్‌ను తయారు చేసి రోడ్లపై రయ్‌..రయ్‌.. మంటూ తిరుగుతున్నారు నల్గొండకు చెందిన బైక్‌ మెకానిక్‌ మహమ్మద్‌ షరీఫ్‌.

Published : 21 May 2024 04:20 IST

తక్కువ ఖర్చుతో సోలార్‌ పవర్‌తో నడిచే బైక్‌ను తయారు చేసి రోడ్లపై రయ్‌..రయ్‌.. మంటూ తిరుగుతున్నారు నల్గొండకు చెందిన బైక్‌ మెకానిక్‌ మహమ్మద్‌ షరీఫ్‌. తాను వాడే ద్విచక్రవాహనం ఇంజిన్‌ మరమ్మతులకు గురవడంతో దానికి బదులుగా 12 వోల్టులు కలిగిన నాలుగు బ్యాటరీలను వాడి, ఒక సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఎలక్ట్రికల్‌ వెహికల్‌ మోటార్‌ బ్యాటరీని బ్యాకప్‌ కోసం ఏర్పాటు చేసి కనెక్షన్‌ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రీఛార్జ్‌ అయితే దాదాపు 40 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. బ్యాటరీల కోసం రూ.30వేలు, సోలార్‌ ప్యానెల్‌ కోసం రూ.10వేలు ఖర్చు చేశారు. కొద్దిగా ఖర్చుతో కూడుకున్న లిథియం బ్యాటరీని వాడి సీసీ తక్కువగా ఉన్న వాహనాలకు అమర్చితే 100 కిలోమీటర్లకు పైగా వెళ్లొచ్చని ఆయన పేర్కొంటున్నారు.

ఈనాడు నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని