అలిపిరి నడకదారి సమీపంలో చిరుతల సంచారం

అలిపిరి నడకదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులుల సంచారం భక్తుల్లో కలకలం సృష్టించింది. సోమవారం నడకదారిలోని ఆఖరి మెట్లవద్ద రెండు చిరుతలు సంచరిస్తుండగా భక్తులు వాటిని చూసి బిగ్గరగా కేకలు వేశారు.

Published : 21 May 2024 04:21 IST

భక్తుల కేకలతో అడవిలోకి పరుగు

తిరుమల, న్యూస్‌టుడే: అలిపిరి నడకదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులుల సంచారం భక్తుల్లో కలకలం సృష్టించింది. సోమవారం నడకదారిలోని ఆఖరి మెట్లవద్ద రెండు చిరుతలు సంచరిస్తుండగా భక్తులు వాటిని చూసి బిగ్గరగా కేకలు వేశారు. దీంతో అవి అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న తితిదే భద్రత, అటవీశాఖల సిబ్బంది అక్కడకు చేరుకుని వాటి జాడలు గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులను గుంపులుగా పంపడంతో పాటు భద్రతా సిబ్బంది వారి వెంట వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు