జూన్‌ మొదటి వారానికి గురుకుల ఐదోతరగతి ప్రవేశాలు పూర్తి

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్‌ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి.

Published : 21 May 2024 04:25 IST

తొలివిడతలో దాదాపు 80 శాతం సీట్ల భర్తీ  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్‌ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. మెరిట్‌ ఆధారంగా ఇప్పటికే తొలివిడత ప్రవేశాలు పూర్తిచేసిన సొసైటీలు.. మిగిలిన సీట్ల భర్తీకి రెండు, మూడు రోజుల్లో రెండోవిడత ప్రవేశాల జాబితాను వెల్లడించనున్నాయి. ఈ నెలాఖరు నాటికి రెండో విడత కౌన్సెలింగ్‌ ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల్లోని 643 గురుకులాల్లో 51,924 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్షకు 1.13 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను విడుదల చేసిన సొసైటీలు తొలివిడత ప్రవేశాల జాబితా ప్రకటించాయి. ప్రవేశాలు పొందిన విద్యార్థులు సంబంధిత గురుకుల పాఠశాలలో ఈనెల 6(గడువుతేదీ)లోగా రిపోర్టు చేశారు. తొలివిడత ప్రవేశాల్లో దాదాపు 80 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలిసింది. మిగిలిన 20 శాతం భర్తీ చేసేందుకు మెరిట్‌ ఆధారంగా రెండో జాబితా సిద్ధమవుతోంది. రెండోవిడత ప్రవేశాల అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి సంబంధిత గురుకుల వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ దరఖాస్తును సొసైటీలు అందుబాటులోకి తీసుకురానున్నాయి. పరీక్ష రాసిన, రాయలేకపోయిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్‌ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని