క్రష్‌ కేంద్రాలపై శిశు సంక్షేమ అధికారుల అధ్యయనం

రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు.. సంరక్షణతో పాటు పూర్వప్రాథమిక విద్యను అందించడం, పౌష్టికాహారం, మానసిక వికాసం కోసం అంగన్‌వాడీ కేంద్రాలను క్రష్‌ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది.

Published : 21 May 2024 04:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు.. సంరక్షణతో పాటు పూర్వప్రాథమిక విద్యను అందించడం, పౌష్టికాహారం, మానసిక వికాసం కోసం అంగన్‌వాడీ కేంద్రాలను క్రష్‌ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఇటీవల హరియాణాలో పర్యటించి అక్కడి సంరక్షణ కేంద్రాలను పరిశీలించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్‌ ఉమెన్‌ పిల్లల సంరక్షణ కోసం 500 క్రష్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరునెలల నుంచి ఆరేళ్ల చిన్నారుల వరకు సంరక్షణ అందిస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల కోసం ఇక్కడే పౌష్టికాహారం అందించి, జాతీయ విద్యావిధానానికి లోబడి ఎర్లీచైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌ అమలు చేస్తోంది.  వీటన్నింటినీ పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ తరహా క్రష్‌ కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని