8న చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్‌ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బత్తిని అమర్నాథ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు.

Published : 21 May 2024 06:02 IST

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్‌ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బత్తిని అమర్నాథ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. అనంతరం రెండు రోజుల పాటు దూద్‌బౌలిలోని తమ నివాసంలో కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు మూడు లక్షల చేప పిల్లలను సిద్ధం చేయాలని మత్స్యశాఖకు లిఖిత పూర్వకంగా తెలియజేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని