విత్తనాలకు రైతుల కుస్తీ

విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఆదిలాబాద్‌ జిల్లాలో నెలకొంది. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో డిమాండ్‌ ఉన్న పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు.

Updated : 21 May 2024 05:45 IST

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఆదిలాబాద్‌ జిల్లాలో నెలకొంది. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో డిమాండ్‌ ఉన్న పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు. లైన్లలో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, గంటల తరబడి పడిగాపులు పడితే ఒకటి, రెండు పత్తి విత్తన సంచులు మాత్రమే ఇస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మండలాల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని