భారీగా పెరిగిన విత్తన పసుపు ధర

రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా పసుపు సాగవుతుంది. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా ఆశించిన ధర రాలేదు.

Published : 21 May 2024 05:37 IST

ఈనాడు, మహబూబాబాద్‌: రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా పసుపు సాగవుతుంది. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా ఆశించిన ధర రాలేదు. మరోవైపు తెగుళ్ల బాధ.. పెట్టుబడి సైతం చేతికందక సాగు విస్తీర్ణాన్ని తగ్గించిన వారే కాకుండా పూర్తిగా మానుకున్న రైతులున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈసారి క్వింటాకు రూ.11 వేలకు పైగా ధర పలుకుతుండడంతో అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారి సాగు విస్తీర్ణం రెట్టింపయ్యే అవకాశం ఉండడంతో విత్తన పసుపునకు డిమాండ్‌ పెరిగింది. గతేడాది వరకు క్వింటా రూ.1500 వరకు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.3 వేల నుంచి రూ.5,500 పలుకుతోంది. ఎకరానికి 8-10 క్వింటాళ్లు విత్తన పసుపు అవసరం. కొనుగోలు చేయడానికి చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నా దొరకడం లేదు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని