జూన్‌ 2 నుంచి పెరగనున్న టోల్‌ రుసుములు

జూన్‌ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు పెరగనున్నాయి.

Published : 22 May 2024 05:45 IST

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: జూన్‌ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 1న రుసుములు పెరగనుండగా... ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. చివరి విడత జూన్‌ 1న ముగియనుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్‌ ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ మేరకు టోల్‌ప్లాజాల నిర్వాహకులకు ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులను జారీ చేసింది. టోల్‌ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని