కిర్గిజ్‌స్థాన్‌ నుంచి విద్యార్థులను రప్పించాలని కిషన్‌రెడ్డి లేఖ

కిర్గిజ్‌స్థాన్‌లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి లేఖరాశారు.

Published : 22 May 2024 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: కిర్గిజ్‌స్థాన్‌లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి లేఖరాశారు. అక్కడ ఘర్షణల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ మంది అక్కడ ఉన్నారని.. వారంతా స్వస్థలాలకు తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వీలైనంత తొందరగా వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని