వైభవం.. నృసింహ జయంత్యుత్సవం

యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి.

Updated : 22 May 2024 05:37 IST

 

కాళీయ మర్దనుడి తిరువీధి సేవోత్సవం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం ఉగ్ర నరసింహుడిని కాళీయ మర్దనుడి అలంకరణతో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. లక్ష పుష్పాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రతువుల్లో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. పాతగుట్టలో కూడా వేడుకలు జరిగాయి. నృసింహ దీక్షా భక్తులు తమ దీక్షను జయంతి వేడుకతో విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని