13 నెలల్లో 30,049 ఫోన్ల రికవరీ

బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు మెరుగైన పనితీరును కనబరుస్తూనే ఉన్నారు.

Updated : 22 May 2024 05:19 IST

దేశంలో రెండో స్థానంలో తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు మెరుగైన పనితీరును కనబరుస్తూనే ఉన్నారు. 13 నెలల కాలంలో 30,049 ఫోన్లను తిరిగి తెప్పించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచారు. రికవరీలో 35,945 ఫోన్లతో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా... 15,426 ఫోన్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో, 7,387 ఫోన్లతో ఆంధ్రప్రదేశ్‌ నాల్గో స్థానంలో నిలిచినట్లు తెలంగాణ సీఐడీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ వ్యాప్తంగా 780 పోలీస్‌స్టేషన్లలో సీఈఐఆర్‌ పోర్టల్‌ను సమర్థంగా నిర్వహిస్తుండటంతో మెరుగైన ఫలితాలను సాధించగలిగారు. రాష్ట్రంలో సగటున రోజుకు 76 ఫోన్లను రికవరీ చేయగలిగినట్లు సీఐడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా సీఐడీ సైబర్‌క్రైమ్‌ ఎస్పీ డా.లావణ్య ఎన్‌జేపీ బృందాన్ని, సహకరించిన పోలీసులను సీఐడీ ఇన్‌ఛార్జి అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని