కాచిగూడ-రాయచూరు రైళ్లు 10 రోజులు రద్దు

కాచిగూడ-రాయచూరు, రాయచూరు-కాచిగూడ డెమూ రైళ్ల (నం.07477/07478)ను ఈ నెల 21 నుంచి 30 వరకు ద.మ.రైల్వేరద్దు చేసింది.

Published : 22 May 2024 05:20 IST

రేపు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ సైతం

ఈనాడు, హైదరాబాద్‌: కాచిగూడ-రాయచూరు, రాయచూరు-కాచిగూడ డెమూ రైళ్ల (నం.07477/07478)ను ఈ నెల 21 నుంచి 30 వరకు ద.మ.రైల్వేరద్దు చేసింది. అలాగే బుధవారం గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (నం.17202)ను రద్దు చేసినట్లు ప్రకటించింది.

నాలుగు రోజులు అదనపు బోగీలు: తిరుపతి-లింగంపల్లి (నం.12733) నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 21 నుంచి 24 వరకు.. లింగంపల్లి-సీఎస్‌ఎంటీ ముంబయి (నం.17058) దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు 22-25 వరకు.. సీఎస్‌ఎంటీ ముంబయి-లింగంపల్లి (నెం.17057) దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను 23-26 వరకు..లింగంపల్లి-తిరుపతి (నం.12734) నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కు 24-27 వరకు అదనపు ఏసీ బోగీలను జత చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు