పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ 23 నుంచి

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు.

Published : 22 May 2024 05:21 IST

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపడతారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు 31 నుంచి జూన్‌ 5 వరకు అవకాశం కల్పించారు. 5 నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. విద్యార్థులు సీటు పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని