ఎంజీఎం ఆసుపత్రిలో పవర్‌ కట్‌.. వరంగల్‌ ఘటనపై నివేదికకు మంత్రి ఆదేశం

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు సుమారు ఐదు గంటల పాటు అంతరాయం కలిగిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు.

Updated : 23 May 2024 07:36 IST

ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్‌ నోటీసు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు సుమారు ఐదు గంటల పాటు అంతరాయం కలిగిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. ఈ ఘటనలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి బాధ్యులను గుర్తించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు వైద్య, ఆరోగ్యసేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జనరేటర్‌ల ద్వారా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో వరంగల్‌ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లను ఇంజినీర్లతో తనిఖీ చేయించాలని, లేని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో.. ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య ఎంజీఎం సూపరింటెండెంట్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని