ఐటీ మంత్రి సలహాదారుగా సాయికృష్ణ

ఐటీశాఖను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐటీశాఖ పరిధిలోని శిక్షణ సంస్థలు, స్టార్టప్‌ విభాగాలకు నూతన అధికారులను నియమించింది.

Updated : 23 May 2024 06:09 IST

పలు సంస్థలకు సీఈవోల నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీశాఖను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐటీశాఖ పరిధిలోని శిక్షణ సంస్థలు, స్టార్టప్‌ విభాగాలకు నూతన అధికారులను నియమించింది. ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సలహాదారుగా సాయికృష్ణను నియమిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. టీవర్క్స్‌ సీఈవోగా జోగిందర్‌ తనికెళ్లను నియమించారు. సీఈవోగా వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. వీహబ్‌ సీఈవోగా సీతా పల్లచోళ్లను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగతా సంస్థలకు సీఈవోలను నియమించే అవకాశమున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని