జూన్‌లో సాధారణ బదిలీలు చేపట్టాలి: టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ

ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగులకు జూన్‌లో సాధారణ బదిలీలు చేయాలని తెలంగాణ ఎస్సీ సంక్షేమ గురుకుల టీచర్లు, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) డిమాండ్‌ చేసింది.

Updated : 23 May 2024 05:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగులకు జూన్‌లో సాధారణ బదిలీలు చేయాలని తెలంగాణ ఎస్సీ సంక్షేమ గురుకుల టీచర్లు, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) డిమాండ్‌ చేసింది. పెండింగ్‌లోని రెండు డీఏ బకాయిలు, ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి కె.సీతాలక్ష్మికి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌.బాలరాజు, ఎన్‌.దయాకర్‌ వినతిపత్రం సమర్పించారు. వేసవి సెలవుల్లో పనిచేసిన జూనియర్‌ లెక్చరర్లకు ఈఎల్స్‌ మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉపాధ్యాయులకు నగదు భృతి చెల్లించడంతో పాటు పలు పోస్టుల నియామకం జరపాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు