ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులపై బ్లూకార్నర్‌ నోటీసులు

విదేశాల్లో ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులైన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఐజీ ప్రభాకర్‌రావు, ప్రైవేటు వ్యక్తి శ్రవణ్‌రావులను రప్పించేందుకు బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలైంది.

Updated : 23 May 2024 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులైన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఐజీ ప్రభాకర్‌రావు, ప్రైవేటు వ్యక్తి శ్రవణ్‌రావులను రప్పించేందుకు బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలైంది. రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించాలనుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతానికి బ్లూకార్నర్‌ తాఖీదులకే పరిమితమవుతున్నారు. దీని ప్రకారం ఇంటర్‌పోల్‌ సభ్య దేశాలు నిందితుల ఆచూకీ కనుక్కొని చెప్పాల్సి ఉంటుంది. వీటి జారీకి హైదరాబాద్‌ పోలీసులు ఇప్పటికే సీఐడీకి లేఖ రాశారు. ఇక్కడ నుంచి సీబీఐకి రాయాల్సి ఉంటుంది. కేసు వివరాలను పరిశీలించాక ఇంటర్‌పోల్‌ అధికారులు బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేస్తారు. సభ్యదేశాలన్నీ నిందితుల వివరాలు ఆరా తీసి, వారెక్కడున్నారో తెలిస్తే సంబంధిత దేశానికి చెప్పాల్సి ఉంటుంది. రెడ్‌కార్నర్‌ నోటీసయితే నిందితుడ్ని అరెస్టు చేసి, బలవంతంగా పంపే ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని