రైలు పట్టాలపై విరిగిపడ్డ చెట్లు

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కోసాయి వద్ద బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సంతో చెట్లు విరిగి రైలు పట్టాలపై పడ్డాయి. దీంతో సాయంత్రం ఏడు గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సిన ఇంటర్‌ సిటీ రైలును రైల్వే అధికారులు మహారాష్ట్రలోని కిన్వట్లో నిలిపివేశారు.

Updated : 23 May 2024 04:50 IST

నిలిచిపోయిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు

రైలు పట్టాలపై తీగలను సరిచేస్తున్న రైల్వే సిబ్బంది 

తలమడుగు, ఎదులాపురం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కోసాయి వద్ద బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సంతో చెట్లు విరిగి రైలు పట్టాలపై పడ్డాయి. దీంతో సాయంత్రం ఏడు గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సిన ఇంటర్‌ సిటీ రైలును రైల్వే అధికారులు మహారాష్ట్రలోని కిన్వట్లో నిలిపివేశారు. ఇదే రైలు ఆదిలాబాద్‌ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌గా రాత్రి 9గంటలకు బయలుదేరాల్సి ఉంది. కోసాయి వద్ద రైలు పట్టాలపై పడ్డ చెట్లను తొలగించి.. విద్యుత్తు తీగలను యుద్ధప్రాతిపదికన సరిచేసే పనులను రైల్వే అధికారులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం ఇంటర్‌సిటీ మళ్లీ బయలుదేరింది. సుమారు 2గంటలకు పైగా కిన్వట్లో నిలిచిపోవటంతో ఇంటర్‌సిటీ ద్వారా ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సిన ప్రయాణికులు, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా హైదరాబాద్, తిరుపతి ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని