రేపు 3 ప్రవేశాల కమిటీల సమావేశాలు

ఈసెట్, ఎప్‌సెట్, పాలిసెట్‌ల నిర్వహణపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీలు ఈ నెల 24న సమావేశం కానున్నాయి.

Published : 23 May 2024 04:42 IST

జూన్‌ 2 లోపు నోటిఫికేషన్‌కు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఈసెట్, ఎప్‌సెట్, పాలిసెట్‌ల నిర్వహణపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీలు ఈ నెల 24న సమావేశం కానున్నాయి. సాధారణంగా తొలుత పాలిటెక్నిక్‌ ప్రవేశాలు చేస్తారు. ఆ తర్వాత ఈసెట్‌ కౌన్సెలింగ్‌ జరుపుతారు. తదనంతరం ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ చేయడం ఆనవాయితీ. సమావేశాలకు ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను కూడా ఆహ్వానిస్తున్నారు. కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఎప్పటిలోగా ఇస్తారన్న దాన్ని బట్టి కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేస్తారు. ఇంజినీరింగ్‌ కళాశాలలకు సంబంధించి జూన్‌ 10వ తేదీ నాటికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇస్తుంది. ఆ తర్వాతే జేఎన్‌టీయూహెచ్, ఓయూ, కేయూలు అనుబంధ గుర్తింపు జారీ చేయాలి. కౌన్సెలింగ్‌ ఎప్పుడు మొదలైనా జూన్‌ 2 లోపు కాలపట్టికను జారీ చేసి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని