పన్నులు చెల్లిస్తున్నాం... రోడ్లు బాగు చేయండి!

అధ్వానంగా మారిన రహదారిని బాగు చేయాలని డిమాండ్‌ చేస్తూ వర్షపు నీటితో నిండిన గుంతలో ఓ మహిళ బైఠాయించిన ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌ డివిజన్‌ ఆనంద్‌నగర్‌ చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది.

Published : 24 May 2024 05:18 IST

రహదారిపై గుంతలు పూడ్చాలని మహిళ నిరసన 

బండ్లగూడ, న్యూస్‌టుడే: అధ్వానంగా మారిన రహదారిని బాగు చేయాలని డిమాండ్‌ చేస్తూ వర్షపు నీటితో నిండిన గుంతలో ఓ మహిళ బైఠాయించిన ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌ డివిజన్‌ ఆనంద్‌నగర్‌ చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది. కుంట్లూర్‌కు చెందిన గోటేటి నిహారిక రోజూ ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటారు. వారం కిందట చౌరస్తాలోని గుంతల కారణంగా వాహనంపై నుంచి కిందపడి.. స్వల్పంగా గాయపడ్డారు. ఇటీవల వర్షాలకు నీరు నిలిచి ఆ గుంతలన్నీ పెద్దవిగా మారడంతో గురువారం మధ్యాహ్నం... నీటితో నిండిన రోడ్డుపై బైఠాయించారు. తాము పన్నులు చెల్లిస్తున్నామని, మంచి రోడ్లు కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక మహిళలు ఇద్దరు ఆమెకు మద్దతుగా నిలిచారు. చౌరస్తాలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో మహిళా పోలీసులు ఆమెను పక్కకు తీసుకొచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి... ఎన్నికల కోడ్‌ ముగియగానే పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నాగోల్‌ పోలీసులు ఆమె వివరాలను నమోదు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని