ఇంజినీర్ల సర్వీసు పొడిగింపు నిలిపివేయండి

నీటిపారుదల శాఖలో పదవీ విరమణ అనంతరం సర్వీసు పొడిగింపుపై కొనసాగిస్తున్న వారిని వెంటనే తొలగించాలని హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరింది.

Published : 24 May 2024 03:20 IST

మంత్రి ఉత్తమ్‌ను కోరిన ఇంజినీర్ల సంఘం 

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో పదవీ విరమణ అనంతరం సర్వీసు పొడిగింపుపై కొనసాగిస్తున్న వారిని వెంటనే తొలగించాలని హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరింది. సంఘం అధ్యక్షుడు ఏఎస్‌ఎన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, ప్రతినిధులు రాపోలు రవీందర్, రాజశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటనారాయణ తదితరులు గురువారం సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో కొందరు ఇంజినీర్లు పదవీ విరమణ చేసినప్పటికీ వారి సర్వీసు పొడిగించారు. దీనివల్ల రెగ్యులర్‌ ఇంజినీర్ల సర్వీసుకు నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఈ పద్ధతిలో ముగ్గురు సర్వీసులో ఉన్నారు. ఇకపై ప్రభుత్వం సర్వీసు పొడిగింపు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రభుత్వ మెమో నంబరు 11656 ప్రకారం ఇంజినీర్ల సీనియారిటీని సవరించి.. ఆ మేరకు నల్గొండ, మహబూబ్‌నగర్‌ ఇంజినీర్లకు కూడా న్యాయం చేసేలా రెగ్యులర్‌ పదోన్నతులు కల్పించాలి. జూనియర్‌ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలతో పదోన్నతులు ఇవ్వొద్దు’ అని సంఘం నాయకులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం నీటిపారుదల కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు వారు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని