జర్మనీలో నర్సు ఉద్యోగాలు

తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌), జర్మనీ ప్రభుత్వ ఫెడరల్‌ ఎంప్లాయిమెంట్‌ ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో జర్మనీలో నర్సు పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని టామ్‌కామ్‌ తెలిపింది.

Published : 24 May 2024 04:16 IST

31లోగా దరఖాస్తులకు టామ్‌కామ్‌ ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌), జర్మనీ ప్రభుత్వ ఫెడరల్‌ ఎంప్లాయిమెంట్‌ ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో జర్మనీలో నర్సు పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని టామ్‌కామ్‌ తెలిపింది. దీనికి ఎంపికయ్యే అభ్యర్థులు జర్మనీ భాషా నైపుణ్య శిక్షణకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. తెలంగాణలో గుర్తింపు పొందిన నర్సింగ్‌ కళాశాలల నుంచి జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి, 1-3 ఏళ్ల క్లినికల్‌ అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపింది. అభ్యర్థుల వయసు 21-38 ఏళ్లలోపు ఉండాలని, ఐసీయూ, జెరియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, కార్డియాలజీ, నియోనాటల్, సర్జికల్‌ వార్డులు తదితరాల్లో పనిచేసిన వారు, జర్మనీ భాషలో నైపుణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. వీసా, ఇమ్మిగ్రేషన్, జర్మనీ వెళ్లేందుకు టికెట్‌ ఉచితంగా అందిస్తామని, వివరాలకు టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని