అడవిపూల చీర కట్టింది.. కృష్ణమ్మ చూడసక్కగుంది..!

అందంగా కనిపిస్తున్న ఈ ఊదారంగు పూలు ఏ రైతు తోటలోనివో అనుకుంటే పొరపాటే. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణాతీరంలో సహజ సిద్ధంగా పెరిగిన మొక్కలు ఇలా అందంగా విరబూశాయి.

Published : 24 May 2024 05:11 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌: అందంగా కనిపిస్తున్న ఈ ఊదారంగు పూలు ఏ రైతు తోటలోనివో అనుకుంటే పొరపాటే. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణాతీరంలో సహజ సిద్ధంగా పెరిగిన మొక్కలు ఇలా అందంగా విరబూశాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో పెరిగే ఈ ఔషధ మొక్క శాస్త్రీయ నామం ‘క్లియోమ్‌ చెల్లిడోని’ అని, తెలుగులో అడవి ఆవాల మొక్కగా పేర్కొంటారని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు డా.సదాశివయ్య తెలిపారు. ఈ మొక్కకు ఔషధ గుణాలుంటాయని చెప్పారు. నదీతీరానికి రెండు వైపులా పరుచుకుని కనిపిస్తున్న ఈ పూల మొక్కలు కృష్ణమ్మ అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని