29 నుంచి పీఈటీ ధ్రువీకరణపత్రాల పరిశీలన

గురుకులాల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు మెరిట్‌ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి జూన్‌ 4 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది.

Published : 25 May 2024 03:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు మెరిట్‌ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి జూన్‌ 4 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది. ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థుల వెబ్‌ఆప్షన్ల లింకు ఈ నెల 20 నుంచి జూన్‌ 4 వరకు అందుబాటులో ఉంటుందని వివరించింది. వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని