26న గీతం ప్రవేశ పరీక్ష ‘గ్యాట్‌’

గీతం డీమ్డ్‌ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, సైన్స్, లా, నర్సింగ్, పారామెడికల్‌ కోర్సుల్లో చేరడానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష గీతం అడ్మిషన్‌ టెస్ట్‌ (గ్యాట్‌-2024)ను ఈ నెల 26న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డి.గుణశేఖరన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 25 May 2024 03:26 IST

విశాఖపట్నం(సాగర్‌నగర్‌), న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, సైన్స్, లా, నర్సింగ్, పారామెడికల్‌ కోర్సుల్లో చేరడానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష గీతం అడ్మిషన్‌ టెస్ట్‌ (గ్యాట్‌-2024)ను ఈ నెల 26న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డి.గుణశేఖరన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు, క్రీడల్లో ప్రతిభ చాటే వారికి గీతం ప్రవేశాల్లో ప్రాధాన్యమిచ్చి, ఉపకారవేతనాలు అందజేస్తామని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచి ఉద్యోగ, విదేశీ విద్యావకాశాలను పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన శిక్షణ అందించేందుకు గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లు రిజిస్ట్రార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు