తడారిన త్రివేణి సంగమం

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమం(గోదావరి, మంజీరా, హరిద్ర) వద్ద గోదావరి నది పరిస్థితి ఇది.

Published : 25 May 2024 04:57 IST

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమం(గోదావరి, మంజీరా, హరిద్ర) వద్ద గోదావరి నది పరిస్థితి ఇది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం లేక గోదావరి ఖాళీ అయ్యి ఇసుక మేటలు బయటపడ్డాయి. త్రివేణి సంగమంలో స్నానాలు చేయడానికి వచ్చే భక్తులు నీరులేక అక్కడక్కడ చిన్న గుంటల్లో ఉన్న నీటిని ఒంటిపై చల్లుకొని మమ అనిపిస్తున్నారు. గోదావరిలో నీరు లేకపోవడంతో త్రివేణి సంగమానికి వచ్చే భక్తుల రద్దీ సైతం తగ్గింది.

ఈనాడు, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు