అర్ధరాత్రి దాటినా హైకోర్టు విధులు

వేసవి సెలవుల సందర్భంగా హైకోర్టు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసి చరిత్ర సృష్టించింది.

Published : 25 May 2024 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి సెలవుల సందర్భంగా హైకోర్టు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసి చరిత్ర సృష్టించింది. సెలవుల కారణంగా ఫైలింగ్‌తో పాటు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటన్నింటిపై విచారించడానికి అర్ధరాత్రి దాటింది. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి అర్ధరాత్రి సుమారు ఒంటి గంట వరకు బెంచ్‌పై కేసులు విచారిస్తూనే ఉన్నారు. అంతకుముందు జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డివిజన్‌ బెంచ్, సింగిల్‌గా జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి సుమారు 200కు పైగా కేసుల విచారణ చేపట్టారు. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌లోనే అర్ధరాత్రి ఒంటిగంట దాకా కేసుల విచారణ చేపట్టారు. జస్టిస్‌ లక్ష్మీనారాయణ, జస్టిస్‌ అనిల్‌కుమార్‌లు రాత్రి 11 గంటలదాకా కోర్టులోనే విధులు నిర్వహించారు. ముగ్గురు న్యాయమూర్తులు 350కి పైగా కేసుల విచారణ చేపట్టగా అందులో 60 నుంచి 70 దాకా పరిష్కారమయ్యాయి. గురువారం విచారించిన కేసుల్లో జారీ చేసిన ఉత్తర్వులన్నింటిపై న్యాయమూర్తులు శుక్రవారం సంతకాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని