పెట్టుబడులకు ముందుకు రావాలి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ)  ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన మెగా కన్వెన్షన్‌ను శనివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) మంత్రి  ప్రారంభించారు.

Published : 26 May 2024 03:36 IST

ప్రవాసులకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపు
వాషింగ్టన్‌లో టీటీఏ మెగా కన్వెన్షన్‌ను ప్రారంభించిన మంత్రి

వాషింగ్టన్‌లో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగా కన్వెన్షన్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
చిత్రంలో ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, అనిరుధ్‌రెడ్డి, మల్లారెడ్డి, అసోసియేషన్‌ ప్రతినిధులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ)  ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన మెగా కన్వెన్షన్‌ను శనివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) మంత్రి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు, అసోసియేషన్‌ ప్రతినిధులు పైళ్ల మల్లారెడ్డి, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు అనునిత్యం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు అవసరమైన భూమి సమకూర్చడం, నిబంధనల మేరకు రాయితీలు కల్పించడంతో పాటు అనుమతుల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలిపారు. ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డలంతా కలిసిమెలిసి ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని