చేనేత బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలు విక్రయించిన వారిపై చర్యలు

పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు యూనిఫామ్‌ తయారీకి చేనేత బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Updated : 26 May 2024 05:29 IST

మంత్రి తుమ్మల ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు యూనిఫామ్‌ తయారీకి చేనేత బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో చేనేత శాఖపై ఆయన సమీక్షించారు. ‘చేనేత వస్త్రాలకు అవసరమైన నూలు రాయితీ కోసం రూ.33.24 కోట్లను టెస్కో విడుదల చేసింది. కానీ కొంత మంది దళారులు పవర్‌లూమ్‌ వస్త్రాలు విక్రయించి నిధులు కాజేయడంతో అర్హులైన కార్మికులకు అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో 2024-25కు సంబంధించి వివిధ శాఖల ద్వారా రూ.255 కోట్ల విలువైన యూనిఫామ్‌లను చేనేతతోనే తయారు చేసేలా టెస్కోకు ఆదేశాలిచ్చాం. గత ప్రభుత్వం 2018లో పవర్‌లూమ్‌ కార్మికులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సంధాన వేతనాల పరిహార పథకం ప్రవేశపెట్టినా దానికి మంత్రి మండలి ఆమోదం లభించక నిధులు విడుదల కాలేదు. చేనేత మిత్ర పథకానిదీ అదే పరిస్థితి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక చేనేత, మరమగ్గాల నవీకరణకు రూ.400 కోట్ల నిధులు వెచ్చిస్తోంది’ అని తుమ్మల తెలిపారు. అలాగే డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులు మంత్రిని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల ఎకరాల ఆయిల్‌పామ్‌ తోటల్లో బిందుసేద్యం పరికరాలు వినియోగిస్తున్నట్లు వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని