రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం

రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో గుట్టలు, స్థిరాస్తి భూములకు కూడా రైతుబంధు ఇచ్చి డబ్బును దుర్వి నియోగం చేశారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

Published : 27 May 2024 03:02 IST

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో గుట్టలు, స్థిరాస్తి భూములకు కూడా రైతుబంధు ఇచ్చి డబ్బును దుర్వి నియోగం చేశారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఆయిల్‌పాం రైతుల అవగాహన సదస్సులో తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ఐదేళ్లలో పంటలకు బీమా తొలగించారని, కొత్త పద్ధతిలో రైతు బీమాకు ప్రీమియంను రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై రైతు సంఘాలు చర్చించాలని కోరారు. విదేశాల నుంచి పామాయిల్‌ దిగుమతితో రూ.లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం మన వద్ద ఆయిల్‌పాం కేవలం 20 శాతం మాత్రమే సాగులో ఉందని, ఇంకా 80 శాతం సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యమని, వచ్చే ఐదేళ్లలో కనీసం లక్ష ఎకరాల్లో సాగయ్యేలా తనవంతు కృషి చేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు