శాంతి, పర్యావరణ పరిరక్షణకు దాజీ కృషి అభినందనీయం

ప్రపంచశాంతి, పర్యావరణ పరిరక్షణకు హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌గైడ్‌ కమలేశ్‌ డి పటేల్‌(దాజీ) చేస్తున్న కృషి అభినందనీయమని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ అన్నారు.

Published : 27 May 2024 05:36 IST

మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌

కన్హా శాంతివనంలో కుటుంబ సభ్యులతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ 

నందిగామ, న్యూస్‌టుడే: ప్రపంచశాంతి, పర్యావరణ పరిరక్షణకు హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌గైడ్‌ కమలేశ్‌ డి పటేల్‌(దాజీ) చేస్తున్న కృషి అభినందనీయమని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబసమేతంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరాన్ని సందర్శించారు. తొలుత హార్ట్‌ఫుల్‌నెస్‌ ప్రతినిధులతో కలిసి ధ్యానం చేశారు. అనంతరం శాంతివనంలో ఏర్పాటుచేసిన బాబూజీ మహరాజ్‌ విగ్రహాన్ని, రెయిన్‌ ఫారెస్ట్, టిష్యూ కల్చర్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మోహన్‌యాదవ్‌ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థతో కలిసి పలు జిల్లాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష మొక్కలు నాటామన్నారు. శివగఢ్‌ ప్రాంతంలో 2 వేల ఎకరాల్లో చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వచ్చేఏడాది 8 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఇందుకోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు. రానున్న రోజుల్లో తమ రాష్ట్రంలో ప్రతి గడపకు సహజమార్గ్‌ పద్ధతి ధ్యానాన్ని తీసుకువెళతామని మోహన్‌యాదవ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని