రాష్ట్ర చిహ్నంలో మార్పులపై చర్చ

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులపై ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం చిత్రకారులతో ఆయన భేటీ అయ్యారు.

Published : 28 May 2024 03:49 IST

 

చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులపై ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం చిత్రకారులతో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుత అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి క్యాబినెట్‌ సమావేశంలో అభ్యంతరం వ్యక్తమైంది. ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా చిహ్నాన్ని రూపొందించాలని అప్పుడే నిర్ణయించారు. అందులో భాగంగానే చిత్రకారుల బృందంతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌కు 12 నమూనాలను చూపించారు. వీటిపైచర్చించిన సీఎం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని