పీఆర్‌ఎల్‌ఐ సీనియర్‌ కన్సల్టెంట్‌ రంగారెడ్డి మృతి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఎల్‌ఆర్‌ఐ) పథకం సీనియర్‌ కన్సల్టెంట్, విశ్రాంత ఇంజినీర్‌ ఎన్‌.రంగారెడ్డి అనారోగ్యంతో సోమవారం మరణించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన గత ప్రభుత్వం.. ప్రారంభంలోనే రంగారెడ్డిని ఈ ప్రాజెక్టుకు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా నియమించింది.

Published : 28 May 2024 03:55 IST

ఈనాడు హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఎల్‌ఆర్‌ఐ) పథకం సీనియర్‌ కన్సల్టెంట్, విశ్రాంత ఇంజినీర్‌ ఎన్‌.రంగారెడ్డి అనారోగ్యంతో సోమవారం మరణించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన గత ప్రభుత్వం.. ప్రారంభంలోనే రంగారెడ్డిని ఈ ప్రాజెక్టుకు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా నియమించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను ఇదే పథకానికి సీనియర్‌ కన్సల్టెంట్‌గా నియమించింది. అయితే ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. సర్వీసులో ఎక్కువగా మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఆ జిల్లాలో కొత్త ప్రాజెక్టుల కోసం ఎంతో కృషిచేశారు. మొదటి నుంచీ ఇంజినీర్స్‌ అసోసియేషన్లలో చురుగ్గా పనిచేసిన ఆయన.. అసోసియేషన్‌ ఆఫ్‌ రిటైర్డ్‌ హైదరాబాద్‌ ఇంజినీర్స్‌ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఆయన మరణం పట్ల ఇంజినీర్ల సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. 

రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఎన్‌.రంగారెడ్డి ఎనలేని కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. రంగారెడ్డి మృతిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భారాస మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని