నెదర్లాండ్స్‌లో ఘనంగా ‘అన్నమాచార్య ఆరాధన’

నెదర్లాండ్స్‌లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, దేవాలయ కాంప్లెక్స్‌ నిర్మించాలన్నదే స్టిచింగ్‌ వసుదైవ కుటుంబకం (కేవీకే) లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది. ఈ కేంద్రం ద్వారా సనాతన ధర్మ విలువలు బోధించడంతో పాటు ప్రజలంతా కలిసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా చేస్తామని పేర్కొంది.

Published : 28 May 2024 04:30 IST

ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, చిన్నారులు

ఈనాడు, హైదరాబాద్‌: నెదర్లాండ్స్‌లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, దేవాలయ కాంప్లెక్స్‌ నిర్మించాలన్నదే స్టిచింగ్‌ వసుదైవ కుటుంబకం (కేవీకే) లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది. ఈ కేంద్రం ద్వారా సనాతన ధర్మ విలువలు బోధించడంతో పాటు ప్రజలంతా కలిసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా చేస్తామని పేర్కొంది. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నెదర్లాండ్స్‌ (తానె), కేవీకే సంయుక్తంగా ఈ నెల 26న (ఆదివారం) అన్నమాచార్య 615వ జయంతి సందర్భంగా ‘అన్నమాచార్య ఆరాధన’ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్‌లోని ఐండోవెన్‌లో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఇండియా, నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం నుంచి వచ్చిన కళాకారులు,  మ్యూజిక్‌ పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని