రేవ్‌పార్టీ కేసు.. విచారణకు నటి హేమ గైర్హాజరు

బెంగళూరు రేవ్‌ పార్టీలో మాదక ద్రవ్యాలను వినియోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి హేమ.. పోలీస్‌ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు జ్వరంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు ఒక వారం సమయం కావాలని సీసీబీ అధికారులకు ఆమె లేఖ పంపించారు.

Updated : 28 May 2024 05:05 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బెంగళూరు రేవ్‌ పార్టీలో మాదక ద్రవ్యాలను వినియోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి హేమ.. పోలీస్‌ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు జ్వరంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు ఒక వారం సమయం కావాలని సీసీబీ అధికారులకు ఆమె లేఖ పంపించారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఎనిమిది మందికి నోటీసులు జారీ చేయగా, హేమ మినహా మిగిలినవారు విచారణకు హాజరయ్యారు. ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని