మేడిగడ్డలో కొనసాగుతున్న పనులు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.

Published : 29 May 2024 04:49 IST

బ్యారేజీ దిగువన కొనసాగుతున్న సీసీ బ్లాక్‌ల అమరిక పనులు

మహదేవపూర్, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. భారీ వరద ప్రవాహం వస్తే ఏడో బ్లాక్‌లోకి ప్రవేశించకుండా నీటి మళ్లింపు కట్టను మరింత దృఢంగా చేసి కట్ట ఎత్తును పెంచారు. బ్యారేజీ దిగువన షీట్‌పైల్స్‌ను నది గర్భంలోకి దించే పనులు కొనసాగుతుండగా.. సీసీ బ్లాక్‌ల అమరికను చేపడుతున్నారు. గేట్లకు సంబంధించి కటింగ్, గ్రౌటింగ్‌కు సంబంధించి డ్రిల్లింగ్‌ పనులకు ఎక్కువ సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. పనులను వేగిరం చేయడంపై ఇంజినీరింగ్‌ అధికారులు మరింత దృష్టి సారించారు. సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాల్సి ఉండగా, పర్యటనపై స్పష్టత రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని