ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో అనుమతించేలా ఆదేశించండి

భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో తమ ప్రతినిధులను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ స్క్వాష్‌ రాకెట్‌ అసోసియేషన్‌ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది.

Published : 29 May 2024 04:50 IST

రాష్ట్ర స్క్వాష్‌ రాకెట్‌ అసోసియేషన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో తమ ప్రతినిధులను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ స్క్వాష్‌ రాకెట్‌ అసోసియేషన్‌ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అసోసియేషన్‌ తరఫున కార్యదర్శి ఎస్‌.శ్రీవాసు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ మే 19న జారీ కాగా..జూన్‌ 6న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అయితే తెలంగాణ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఈ నెల 25న జారీ చేసిన ఎన్నికల కాలేజీ ప్రొసీడింగ్స్‌లో తమ అసోసియేషన్‌ ప్రతినిధులను తొలగించారని పేర్కొన్నారు. తమ ప్రతినిధులకు అవకాశం కల్పించేలా తెలంగాణ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇండియన్, తెలంగాణ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌లు, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఈ నెల 30న విచారణ జరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని