పచ్చిరొట్ట విత్తనాలకు రైతుల బారులు

రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాల(జనుము, జీలుగ) పంపిణీ జరుగుతుండగా వాటి కోసం రైతులు బారులు తీరుతున్నారు.

Updated : 29 May 2024 04:55 IST

మెట్‌పల్లిలో పంపిణీ కేంద్రం వద్ద పచ్చిరొట్ట విత్తనాల కోసం వరుసలో నిలుచున్న రైతులు 

మెట్‌పల్లి, పుల్కల్, ఇబ్రహీంపట్నం-న్యూస్‌టుడే: రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాల(జనుము, జీలుగ) పంపిణీ జరుగుతుండగా వాటి కోసం రైతులు బారులు తీరుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని రైతులకు సుమారు 3 వేల జనుము, జీలుగ విత్తనాల సంచులు అవసరం కాగా వెయ్యి సంచులు వచ్చాయని, బుధవారం మళ్లీ విత్తనాలు వస్తాయని ఇక్కడి అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో మంగళవారం జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకే రైతులు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. ఎండ తీవ్రత కారణంగా రైతు సేవాకేంద్రం-1 వద్ద పలువురు పాసుపుస్తకాల జిరాక్సుల కాగితాలను వరుసలో పెట్టారు. ఇదేవిధంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం రైతు వేదిక వద్ద రైతులు పాసుపుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌ పత్రాలను వరుసలో ఉంచారు. జీలుగ, జనుము విత్తనాలు దశల వారీగా వస్తాయని మండల వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని