అమెరికాలో అదృశ్యమైన నిజామాబాద్‌ యువతి క్షేమం

అమెరికాలో అదృశ్యమైన నిజామాబాద్‌ యువతి నితీష కందుల(23) క్షేమంగా ఉన్నట్లు అక్కడి పోలీసులు మంగళవారం తెలిపారు.

Published : 05 Jun 2024 04:33 IST

హ్యూస్టన్‌: అమెరికాలో అదృశ్యమైన నిజామాబాద్‌ యువతి నితీష కందుల(23) క్షేమంగా ఉన్నట్లు అక్కడి పోలీసులు మంగళవారం తెలిపారు. కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్న ఆమె గత నెల 28 నుంచి కనిపించకుండాపోయారు. లాస్‌ఏంజెల్స్‌లో అదృశ్యమైన ఆమె ఆచూకీ కనుగొన్నామని క్షేమంగా ఉన్నట్లు పోలీసు అధికారి జాన్‌ గుట్టిరెజ్‌ తెలిపారు. ఆమె అదృశ్యానికి గల కారణాలు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని