10 నుంచి పీఈసెట్‌

రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎడ్‌), బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు పీఈసెట్‌ను నిర్వహించనున్నారు.

Published : 05 Jun 2024 04:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎడ్‌), బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు పీఈసెట్‌ను నిర్వహించనున్నారు. పరీక్షలో భాగంగా అభ్యర్థులకు ఫిట్‌నెస్, వివిధ క్రీడల్లో ప్రావీణ్యాన్ని పరీక్షించే స్కిల్‌ టెస్ట్‌లను జరుపుతారు. ఈ నెల 10, 11 తేదీల్లో పురుష అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ ఆచార్య రాజేశ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని