ఉద్యానంలో బాహుబలి మందార చెట్టు!

సాధారణంగా మందార చెట్టు 5 నుంచి 6 అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు దారిలో ఉన్న ప్రభుత్వ ఉజ్వల ఉద్యానంలో 12 అడుగులకు పైగా ఎత్తుతో,

Published : 05 Jun 2024 07:25 IST

సాధారణంగా మందార చెట్టు 5 నుంచి 6 అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు దారిలో ఉన్న ప్రభుత్వ ఉజ్వల ఉద్యానంలో 12 అడుగులకు పైగా ఎత్తుతో, దాదాపు 20 అడుగుల వెడల్పుతో పెరిగిన మందార చెట్టు పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మాల్వేసి కుటుంబానికి చెందిన మందార మొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్‌ రోజా సైనెన్సిస్‌ అని.. ఏడాదంతా పూలు పూచే ఈ మొక్కను పెరట్లు, ఉద్యానవనాల్లో నాటుతారని శాతవాహన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర అధ్యాపకులు నరసింహమూర్తి తెలిపారు. ఇంత ఎత్తులో పెరగటం అరుదుగా చూస్తుంటామని సరైన పోషకాలు, నీరు అందిస్తే ఇది సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. 

కరీంనగర్, ఈనాడు-కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని