సాంకేతిక కారణాలతో నిలిచిన మెట్రో రైలు

మెట్రో రైలు సేవల్లో అంతరాయం, లోపాల కారణంగా ప్రయాణికులు బుధవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వస్తున్న మెట్రో రైలు సాంకేతిక కారణాలతో సాయంత్రం ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది.

Published : 06 Jun 2024 06:00 IST

తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు

ఈనాడు డిజిటల్, ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైలు సేవల్లో అంతరాయం, లోపాల కారణంగా ప్రయాణికులు బుధవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వస్తున్న మెట్రో రైలు సాంకేతిక కారణాలతో సాయంత్రం ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. కొంత సమయం రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో సమయంలో ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ఎగ్జిట్‌ మెషీన్లు మొరాయించాయి. దీంతో ప్రయాణికులు బయటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ స్పందించింది. జోరు వాన, గాలుల కారణంగా ఎంజీబీఎస్‌ ట్రాన్స్‌కో ఫీడర్‌ ట్రిప్‌ అవడంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిన కారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా మియాపూర్‌ ఫీడర్‌ నుంచి అనుసంధానం చేసి ఏడు నిమిషాల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని